మోడిని బలపర్చండి – దేశాన్ని కాపాడండి
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి
ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవం
దేశం అన్ని రంగాల్లో విశేష అభివృద్ధి సాధించడానికి , దేశ ప్రజల భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపర్చాలని, తద్వారా దేశాన్ని కాపాడుకోవచ్చని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి అన్నారు. ఈ రోజు బిజెపి 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. బెల్లంపల్లి పట్టణంలో పట్టణ అధ్యక్షురాలు కళ్యాణి, లంబాడితండలో అజ్మీరా శ్రీనివాస్ పార్టీ పతాకాలను ఎగుర వేశారు. ఈ కార్యక్రమాలకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు, బిజెపి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. వారం రోజుల పాటు బిజెపి వారోత్సవాలు ప్రతి ఊరిలో జరపాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తేవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి గోవర్ధన్, అసెంబ్లీ కన్వీనర్ సంతోష్, పట్టణ అధ్యక్షురాలు కళ్యాణి, సీనియర్ నాయకులు కేశవరెడ్డి, శ్రీనివాస్, శ్రావణ్ కుమార్, నర్సింగ్, మోహన్, మద్దెర్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.