ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం
అనంతపురం జిల్లా ఉరవకొండలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇంచార్జి గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అనంతరం ఉరవకొండ సర్వజన ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా గౌతమ్ కుమార్ మాట్లాడుతూ పార్టీ 12 సంవత్సరాలు పూర్తి చేసి 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.అలాగే క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

