ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న రేవంత్ సర్కార్.. కాంగ్రెస్ తొత్తులుగా మారిన పోలీసులు మూల్యం చెల్లించక తప్పదు.
మాజీ మంత్రి హరీష్ రావు
ఆదిలాబాద్ సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పరామర్శించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న విద్యార్థి నాయకుడు బాల్క సుమన్‌తో పాటు రాజిరెడ్డి, అనిల్, లక్ష్మీకాంత్‌లను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది.రామగుండం కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లితో పాటు ఆసిఫాబాద్‌లో జైళ్లు ఉన్నప్పటికీ.. వాళ్లను అక్కడ పెట్టకుండా కక్షపూరితంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్ జైలుకు తీసుకువచ్చి పెట్టడం దుర్మార్గం.క్యాతన్‌పల్లిలోని 22 స్థానాలకు గాను 14 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. బీఆర్ఎస్, సీపీఐ కూటమిని ప్రజలు గెలిపించారు.ప్రజలు ఇచ్చిన తీర్పును మంత్రి వివేక్ గారు శిరసావహించాల్సింది పోయి, ఇలా ప్రజా తీర్పును కాలరాయడం సరికాదు.
కోరం ఉన్నప్పటికీ చైర్మన్ ఎన్నిక రోజు కావాలనే పోలీసు బందోబస్తు లేకుండా చేసి, చైర్మన్ ఎన్నిక జరగకుండా వాయిదా పడేలా చేశారు.అధికారులు, పోలీసుల సమక్షంలో, మంత్రి వివేక్ గారు చూస్తుండగానే దళిత, గిరిజన, మహిళా కౌన్సిలర్లపై దౌర్జన్యంగా, నోటితో చెప్పలేని విధంగా అసభ్యంగా ప్రవర్తించారు. మహిళలపై చేయి చేసుకున్నారు.
మహిళలపై దాడి జరుగుతున్నప్పుడు వివేక్ గారు మంత్రి హోదాలో అక్కడే ఉండి కూడా కనీసం పట్టించుకోకపోవడం, కోరం ఉన్నా ఎన్నిక వాయిదా వేసి వెళ్లిపోవడం శోచనీయం.
క్యాతన్‌పల్లి మహిళా కౌన్సిలర్ల తరపున రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళితే కనీసం కంప్లైంట్ తీసుకోలేదు.
కౌన్సిల్‌కు మద్యం తాగి వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్లపై ఎందుకు కేసులు నమోదు చేయలేదు? రాజిరెడ్డి గారి కారు ధ్వంసం చేసిన వారిపై కేసులు ఉండవు కానీ, మా కౌన్సిలర్లపై మాత్రం అక్రమ కేసులు పెట్టారు.బాల్క సుమన్, కోవా లక్ష్మీలను ఎమ్మెల్యేలుగా ఉండి కూడా లోపలికి పంపించకుండా.. కేవలం మంత్రిని ఎలా పంపిస్తారని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మాపై దాడి చేశారు.పోలీస్ స్టేషన్లలో అక్రమ కేసులతో అరెస్టు చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను కాంగ్రెస్ గుండాలు స్టేషన్‌కు వచ్చి మరీ కొడుతున్నారు. ఈ రకమైన దాడులు మంచివి కావు.

