ఘనంగా మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం
మేయర్ గా ధరణి మధుకర్__ డిప్యూటీ మేయర్ గా సల్ల రమ్య
మంచిర్యాల జిల్లా కేంద్రం లో ఉన్న నగరపాలక సంస్థలో నూతన పాలకవర్గం కొలువు తీరింది. జిల్లాలో 60 డివిజన్లతో కూడిన నూతనంగా ఏర్పడిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన ధరణి మధుకర్ ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. నూతన కార్పోరేషన్ గా ఏర్పడిన మంచిర్యాల మొదటి మేయర్ గా ఆయన ప్రమాణ స్వీకారోత్సవం చేయడం జరిగింది.గత నాలుగు రోజుల నుండి ఎవరు మేయర్ ఎవరు డిప్యూటీ మేయర్ అనే ఉత్కంఠకు నేటితో తెరపడింది. అందులకు గాను పలువురు మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం ఆశించినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆశీస్సులు ధరణి మధుకర్ అలాగే సల్ల రమ్యకు లభించిందని చెప్పవచ్చు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ గా సల్ల రమ్యను కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్లు ఎన్నుకున్నారు. 60 డివిజన్లలో 44 డివిజన్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అధికార పీఠాన్ని హుందాగా దక్కించుకుంది. 60 కార్పోరేటర్లతోపాటు ఒక స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఎక్స్ అఫీషియల్ సభ్యుడుగా మొత్తం 61 మంది 45 మంది లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పోరేటర్ తూముల నరేష్ మంచిర్యాల మేయర్ గా ధరణి మధుకర్ పేరును ప్రతిపాదించి బలపరచగా, మిగతా సభ్యులు ఇనామస్ గా మద్దతు తెలపడంతో మంచిర్యాల మేయర్ గా ధరణి మధుకర్ ప్రమాణస్వీకారం చేశాడు . అలాగే డిప్యూటీ మేయర్ గా రమ్య పేరును మరో కాంగ్రెస్ కార్పోరేటర్ పేరు ప్రతిపాదించగా మిగతా సభ్యులు బలపరచడంతో సల్ల రమ్య డిప్యూటీ మేయర్ గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ప్రజలు ,తోటి కార్పొరేటర్లు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అందరి దీవెనలతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ను అభివృద్ధి చేస్తామని ప్రమాణం చేశారు.

