గడపగడపలో బిజెపి జెండా ఎగరాలి
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్
మంచిర్యాల జిల్లా కేంద్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించడం జరిగింది.ఈ సందర్భంగా ఐబి చౌరస్తాలో ఏర్పాటుచేసిన భారీ మహాసభలో మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రసంగించడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ మంచిర్యాల్ జిల్లా అనునది అతి తక్కువ సమయంలో తెలంగాణలో అభివృద్ధి చెందిన జిల్లాగా పేరు గాంచినది అని కొనియాడారు.ఈ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన కార్పొరేట్ డివిజన్లో ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది అని తెలిపారు. ఎందుకనగా బిజెపి పార్టీతోనే దేశ అభివృద్ధి, తద్వారా రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ చేసిన అభివృద్ధి,సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. కాబట్టి జిల్లాలో 60 డివిజన్లో పోటీ చేస్తున్న ప్రతి బిజెపి అభ్యర్థిని గెలిపించుకొని,వారి వారి డివిజన్లో అభివృద్ధి చేసుకోవాలని,అలాంటి సమర్థవంతమైన అభ్యర్థులను మాత్రమే ఎంచుకోవాలని ప్రజలకు సూచనలు ఇచ్చారు. అందుకే ప్రతి ఇంట బిజెపి జెండా ఎగరాలని తద్వారా దేశ రక్షణ, కుటుంబ రక్షణ అనేవి సాధ్యపడతాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు,రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్,జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు గౌడ్, నాయకులు,మహిళ నాయకులు, ప్రతి డివిజన్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

