Praja Telangana
తెలంగాణ

మ్యాథ్స్ క్విజ్ కాంపిటీషన్ లో గోల్డ్ మెడల్ సాధించిన ఉదారి వర్షిత్ కుమార్ గౌడ్

జిల్లా కేంద్రంలోని కార్మెల్ సీబీఎస్ఈ పాఠశాలలో నిర్వహించిన మ్యాథ్స్ క్విజ్ కాంపిటీషన్ లో తొమ్మిదవ తరగతి విద్యార్థి ఉదారి వర్షిత్ కుమార్ గౌడ్ గోల్డ్ మెడల్ సాధించాడు. మన దేశంలో గణిత చరిత్రకు వన్నెలద్దిన శ్రీనివాస రామానుజన్ జన్మదినం (డిసెంబర్ 22) పురస్కరించుకుని పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ రినెట్, సొల్యూషన్స్ రిప్రజెంటేటివ్ రామకృష్ణ ఆధ్వర్యంలో కార్మెల్ సీబీఎస్ఈ పాఠశాలలో నిర్వహించిన మ్యాథ్స్ క్విజ్ కాంపిటీషన్ లో తొమ్మిదవ తరగతి విద్యార్థి ఉదారి వర్షిత్ కుమార్ గౌడ్ బంగారు పతకాన్ని సాధించాడు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పాఠశాలలో నిర్వహించిన మ్యాథ్స్ క్విజ్ పోటీలో విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించడం అద్భుత విజయమని, ఈ సాధన గణితంలో అతని దృఢమైన పట్టుదల, సమర్థతను సూచిస్తుందని, ఇలాంటి పోటీలు విద్యార్థులలో సమస్యలు పరిష్కరించే నైపుణ్యాలను, విశ్లేషణాత్మక ఆలోచనను మరింత బలపరుస్తాయని అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మద్దతుతో ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయని, భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని, ఇలాంటి స్ఫూర్తిని కొనసాగించాలని, ఈ విజయం వారి విద్యాభ్యాసంలో మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. క్విజ్ కాంపిటీషన్ లో పాల్గొన్న విద్యార్థులను ప్రిన్సిపాల్ సిస్టర్ రినెట్, ఉపాధ్యాయులు అభినందించారు.

Related posts

కాలేశ్వరం సరస్వతి పుష్కరాలలో పాల్గొన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్*

ఘనంగా టైలర్స్ డే దినోత్సవం వేడుకలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకో అవకాశం ఇవ్వండి: రాజాసింగ్

Share this