Praja Telangana
తెలంగాణ

ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్.. 150 గ్రాముల గంజాయి స్వాధీనం

ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్.. 150 గ్రాముల గంజాయి స్వాధీనం

సమాచారం అందించి నేరాల నియంత్రణకు సహకరించాలని ప్రజలకు సీఐ విజ్ఞప్తి

ప్రభుత్వ నిషేధిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి, వారి నుండి 150 గ్రాముల డ్రై గంజాయిని స్వాధీనపరచుకున్నామని పట్టణ సీఐ కే శశిధర్ రెడ్డి తెలిపారు. ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ వివరాలు వెల్లడించారు. మందమర్రి ఎస్ఐ రాజశేఖర్, రామకృష్ణాపూర్ పోలీస్ లు సంయుక్తంగా రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రి సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారని, వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, కూలి పని చేసుకునే మంచిర్యాలకు చెందిన ఎస్ కె గౌసియా (35) మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వే స్టేషన్ వద్ద తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి, ఐటీఐ విద్యార్థి గంగాదరీ పృధ్వీతేజ(20)కు విక్రయించగా, అతను గంజాయిని యువతకు అమ్ముతున్నట్లు ఇద్దరు నిందితులు అంగీకరించారని, ఈ మేరకు వారి నుండి 150 గ్రాముల గంజాయి, రూ. 1500 నగదు, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు యువత డ్రగ్స్ కు అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా కోరారు. గంజాయి ఇతర మాదక ద్రవ్యాల కొనుగోలు, అమ్మకాలు లేదా రవాణాకు సంబంధించిన సమాచారం ఏమైనా తెలిస్తే, వెంటనే పోలీసులకు తెలుపాలని, సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని అన్నారు. మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో మందమరి ఎస్సై ఎస్ రాజశేఖర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఘనంగా మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం

Chief Editor: Satish Kumar

బెల్లంపల్లి, పట్టణంలో రోడ్డు పనులు పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్

Share this