Praja Telangana
తెలంగాణ

బెల్లంపల్లి గురుకుల విద్యార్థుల ఆందోళన

బెల్లంపల్లి గురుకుల విద్యార్థుల ఆందోళన

నేటి ప్రజా తెలంగాణ

సిర్పూర్ గురుకుల పాఠశాల, హాస్టల్ భవనాలు పక్కాగా నిర్మించి తమను తిరిగి అక్కడికి పంపించాలని డిమాండ్ చేస్తూ సిర్పూర్ గురుకుల విద్యార్థులు ఆదివారం బెల్లంపల్లి సీఓఈ ఎదుట బైఠాయిస్తూ ఆందోళన చేశారు.
తాము చదువుతున్న సిర్పూర్ భవనం శిథిలావస్థలో ఉండడంతో తాత్కాలికంగా బెల్లంపల్లి సి ఓ ఈ కి పంపించారని, అయితే ఐదు నెలలు గడిచినా తిరిగి తమ పాఠశాలకు పంపకపోవడంతో ఇక్కడ ఉండలేమంటూ విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు స్పందించి సురక్షితమైన పాఠశాల, హాస్టల్ నిర్మాణం చేపట్టి తమను వెంటనే సిర్పూర్ గురుకులానికి పంపించాలని విద్యార్థులు కోరారు.

Related posts

భూభారతి చట్టంను గ్రామంలో రైతులకు అనుకూలంగా ఎలాంటి లొసుగులు లేకుండా అమలు చేయాలి*

Chief Editor: Satish Kumar

Share this