Praja Telangana
తెలంగాణ

అడ్డా కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

కార్మికుల పక్షాన ప్రశ్నించే గౌంతుక అవుతాము…
కార్మికుల చెమట చుక్కలకు ప్రతీకగా ఏర్పడిందే తెలంగాణ రాజ్యాధికార పార్టీ…

కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తాం…

జిల్లా అడ్డా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కు వినతిపత్రం…

అడ్డా కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడుతాం…

మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ…

కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా, కార్మికుల పక్షాన ప్రశ్నించే గౌంతుకలమౌతామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ అన్నారు. సోమవారం అడ్డా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మహేష్ వర్మ మాట్లాడుతూ.. అన్ని పార్టీలు ఎన్నికల సమయంలో ఓటు వేసే ఎంత్రాలుగా మాత్రమే కార్మికులను చూస్తున్నాయి తప్ప కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. కార్మికుల, కర్షకుల చెమట,రక్తంబొట్టు నుండి ఆవిర్భవించిందే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని అన్నారు. ఇది సంబండా కులాల ఆత్మగౌరవం అని అన్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారి ఆదేశాలమేరకు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 50వేలమంది అడ్డా కార్మికుల పక్షాన ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పనిచేస్తుందని అన్నారు. వివిధ కూలి పనుల నిమిత్తం రోజు వందలాదిమంది అడ్డ కార్మికులు వస్తు వెళ్తున్నారని, ప్రధాన అడ్డ కేంద్రాలైన ముఖారాం చౌరస్తా, గోదావరి రోడ్డు (ఫ్లై ఓవర్ బ్రిడ్జి), అడ్డాల వద్ద కనీసం త్రాగునీరు సౌకర్యం లేక, మరుగుదొడ్లు లేక, అనేకమంది మహిళా కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, అడ్డ కార్మికుల కనీస సౌకర్యార్థం మరుగుదొడ్ల నిర్మాణం, త్రాగునీటి సౌకర్యాన్ని వెంటనే ఏర్పాట్టు చేయాలని కోరారు. అలాగే కార్మికులకు లేబర్ కార్డు సమస్యలను పరిష్కరించే విధంగా జిల్లా లేబర్ అధికారిని కార్మికులకు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకొని, లేబర్ కార్మికుల వివిధ ప్రభుత్వ పథకాల దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని కోరారు. కార్మికులకు ప్రభుత్వం తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల జీవన మనుగడ నిమిత్తం, ప్రభుత్వ రంగాల్లో చేపడుతున్న వివిధ నిర్మాణాల్లో మంచిర్యాల జిల్లా కార్మికులను 60 శాతం మందిని తీసుకోవాలని, ప్రాంతీయతకు ప్రాధాన్యతను ఇవ్వాలని, ఇతర రాష్ట్రాల కార్మికులను తీసుకొని, స్థానిక కార్మికుల ఆకలి కేకలకు కరణం కావొద్దని అన్నారు. దీనిపై కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు..
పేరుకే కార్మికశాఖ మంత్రి: మంచిర్యాల జిల్లా వాస్తవ్యులు చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, కార్మికశాఖ మంత్రిగా గడ్డం వివేక్ ఉన్నప్పటికీ కనీసం ఇప్పటివరకు జిల్లా కేంద్రానికి వచ్చింది లేదని, కార్మికుల సమస్యలను చెప్పుకుందామన్న సమయం ఇవ్వడం లేదని పలువురు కార్మిక సంఘాల నాయకులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ దృష్టికి తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరుతో జిల్లా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.

Related posts

హనుమకొండలో దొడ్డి కొమరయ్య సినిమా వాల్ పోస్టర్ ఆవిష్కరణ

37వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఎం.డి ఖలీద్ ప్రచారం

కలెక్టర్ కార్యాలయంలో అదిలాబాద్ జిల్లా స్థాయి సమావేశం

Share this