*విశ్వకర్మలకు ప్రత్యేక పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయాలి*
*ఉపాధి అవకాశాలు, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి*
*కస్తూరి శ్రీనాథ్ చారి*
మంచిర్యాల
తేది:17సెప్టెంబర్,
కలెక్టర్ కార్యాలయంలో అధికారికంగా నిర్వహించిన శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుని యజ్ఞ మహోత్సవాల లో జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కస్తూరి శ్రీనాథ్ చారి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బి.సి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ మహోత్సవాలను జరపడం అభినందనీయమని పేర్కొంటూ, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
అదేవిధంగా, గత ఎన్నికల సమయంలో విశ్వకర్మలకు ఇచ్చిన హామీలలో భాగంగా ప్రతి మండలకేంద్రంలో ప్రత్యేకంగా “పారిశ్రామిక వాడలు” ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కమ్మరులకు వెల్డింగ్ షాపులు, వడ్రంగులకు కర్ర ఫర్నిచర్ పరిశ్రమలు, కంచరులకు ఇత్తడి–రాగి పరిశ్రమలు, శిల్పులకు గ్రానైట్ పరిశ్రమలు, స్వర్ణకారులకు బంగారు ఉత్పత్తుల మార్కెట్ కల్పించాలని సూచించారు. దీంతో విశ్వకర్మల ఉపాధి, ఆర్థికాభివృద్ధికి మార్గం సుగమమవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి రావుల హరీష్ చారి, కోశాధికారి అబ్బోజు నాగరాజు, సభ్యులు గొల్లపెల్లి భగవాన్ చారి తదితర నాయకులు, విశ్వబ్రాహ్మణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

