వర్కింగ్ జర్నలిస్టులకు సింగరేణి క్వార్టర్లు కేటాయించండి
మందమర్రి జీఎం కు టిడబ్ల్యూజేఎఫ్ యూనియన్ వినతి పత్రం
మందమర్రి, జులై 4,
నేటి ప్రజా తెలంగాణ,
వర్కింగ్ జర్నలిస్టులకు సింగరేణి క్వార్టర్లు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) మంచిర్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మిట్టపల్లి మధు, సత్యగౌడ్ ఆధ్వర్యంలో సింగరేణి కాలరీస్ మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ జి దేవేందర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు మధు మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులు అహర్నిశలు ప్రజా సమస్యలపై పోరాడుతూ, తమ సమస్యలను పరిష్కరించలేకపోతున్నా జర్నలిస్ట్ లకు సింగరేణి సంస్థ క్వార్టర్లు కేటాయించాలని కోరామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ లు శ్రీనాథ్, మడ్డి వేణు గోపాల్ గౌడ్, జిల్లా జాయింట్ సెక్రటరీ సుమన్, కోశాధికారి భాస్కర్, సెక్రటరీ సురేష్, పట్టణ జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.