మోడీ క్యాంటీన్ ఆధ్వర్యంలో అల్పాహార పంపిణీ
న్యాయవాది నల్లుల సంగీత ఆధ్వర్యంలో పంపిణీ
బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ ఎంపిక పోటీలకు హాజరైన క్రీడాకారులకు మోడీ క్యాంటీన్ ద్వారా న్యాయవాది నల్లుల సంగీత ఆధ్వర్యంలో ఉదయం అల్పాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు మనోధైర్యం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మోడీ క్యాంటీన్ అంటే ప్రజాసేవ కోసమే అని, బీదవారికి విద్యార్థులకు అన్ని వర్గాల ప్రజలకు అండదండలుగా ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టామని భారతదేశం మోడీ అభివృద్ధి చూసి ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయని ఆ గొప్పతనం మోడీది అని అందుకే మోడీ అంటే ప్రజల్లో అపార నమ్మకం అని ఈ సందర్భంగా వారు తెలిపారు.మోడీ క్యాంటీన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు ప్రజలకు అందిస్తామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు