Praja Telangana
తెలంగాణ

మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం: నెన్నెల ఎస్ఐ

మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం: నెన్నెల ఎస్ఐ

గంజాయి నిర్మూలనే ధ్యేయంగా పోలీస్ శాఖ భారీ అవగాహన ర్యాలీ
నెన్నెల మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించాలనే గొప్ప లక్ష్యంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని నెన్నెల, ఎస్ఐ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల, అక్రమ రవాణా దినోత్సవ సందర్భంగా నెన్నెల ఎస్సై “మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన ర్యాలీ”ని గురువారం ఘనంగా నిర్వహించారు.
మందమర్రి సింగరేణి గ్రౌండ్ నుండి మార్కెట్ మీదుగా సాగిన ఈ భారీ ర్యాలీ పాఠశాలల విద్యార్థులు, యువత, రాజకీయ నాయకులు, మహిళలు, పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. “మత్తుకు బానిసలై బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోకండి” వంటి నినాదాలతో విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించి ప్రజలలో చైతన్యం నింపారు. అనంతరం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువత ప్రతిజ్ఞ చేసి, “యాంటీ డ్రగ్ సోల్జర్స్”గా సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా నెన్నెల ఎస్సై మాట్లాడుతూ, “దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. అలాంటి యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలై పురోగతికి, ఉజ్వల భవిష్యత్తుకు స్వయంగా అవరోధాలు సృష్టించుకోవద్దు. సమాజం నుండి మాదకద్రవ్యాలను సమూలంగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. పోలీస్ శాఖ గంజాయి వంటి మత్తుపదార్థాల అమ్మకం వాడకంపై కఠినంగా వ్యవహరిస్తుంది,” అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Related posts

బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం

BSNL శుభవార్త: సిమ్ డోర్ డెలివరీ

ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Share this