Praja Telangana
తెలంగాణ

మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు రాష్ట్రపతి సన్మానం

మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు రాష్ట్రపతి సన్మానం

Jun 25, 2025,

మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు రాష్ట్రపతి సన్మానం
మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థకు చెందిన ఇద్దరు ప్రతిభావంతులైన విద్యార్థులు రిషబ్ ఓస్వాల్, కొత్తపేట తేజశ్వినిలకు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఘన సన్మానం జరిగింది. సీఎంఏ ఫైనల్ పరీక్షా ఫలితాలలో అఖిల భారత స్థాయిలో ప్రథమ ర్యాంకులు సాధించిన సందర్భంగా వారిని న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈనెల 23వ తేదీన రాష్ట్రపతి అభినందించారు. Lడిసెంబర్ 2024 అటెంట్‌లో రిషబ్ ఓస్వాల్, అలాగే జూన్ 2024 అటెంట్‌లో కొత్తపేట తేజశ్విని ఈ ప్రతిష్టాత్మక అఖిల భారత ఫస్ట్ ర్యాంకులను సొంతం చేసుకున్నారు. ఈ అరుదైన విజయంపై మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ గ మాట్లాడుతూ.. వివిధ కామర్స్ కోర్సులలో తమ విద్యార్థులు ఇప్పటివరకు 55 సార్లు ఫస్ట్ ర్యాంకులు సాధించినప్పటికీ, ఫైనల్ లెవల్లో ఒకేసారి ఇద్దరు విద్యార్థులకు అఖిల భారత ఫస్ట్ ర్యాంకులు రావడం చాలా అరుదైన సంఘటన అని పేర్కొన్నారు. ఇలాంటి ఉత్తమ ఫలితాలను సాధించడానికి కృషి చేసిన విద్యార్థులకు, వారికి సహకరించిన తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విజయం మాస్టర్ మైండ్స్ నాణ్యమైన విద్యకు, విద్యార్థుల అంకితభావానికి నిదర్శనమని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Related posts

గాలి మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్*

Chief Editor: Satish Kumar

ఎంబీసీ డిఎన్టి ల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

BSNL శుభవార్త: సిమ్ డోర్ డెలివరీ

Share this