బెల్లంపల్లి కమిషనర్గా తన్నీరు రమేశ్
బెల్లంపల్లి మున్సిపాలిటీ నూతన కమిషనర్గా తన్నీరు రమేశ్ నియామకమయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న శ్రీనివాసరావు CDMAకు బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. భూపాలపల్లి మున్సిపాలిటీలో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న తన్నీరు రమేశ్ను బెల్లంపల్లి మున్సిపాలిటీ కమిషనర్గా నియమించారు. ఈ మేరకు ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు.