Praja Telangana
తెలంగాణ

గంజాయి రహిత సమాజ నిర్మాణమే మనందరి లక్ష్యం కావాలి

గంజాయి రహిత సమాజ నిర్మాణమే మనందరి లక్ష్యం కావాలి

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి

యాంటీ-డ్రగ్ అవేర్నెస్ వారోత్సవాలలో భాగంగా తంగళ్ళపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు దిశానిర్దేశం.
నేటితరం యువత, ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాల మహమ్మారికి దూరంగా ఉంటూ, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని, గంజాయి రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి పిలుపునిచ్చారు. యాంటీ-డ్రగ్ అవేర్నెస్ వారోత్సవాలలో భాగంగా సోమవారం తాండూర్ సర్కిల్ కార్యాలయం తో పాటు మాదారం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో విద్యార్థులచే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సి. ఐ మాట్లాడుతూ, విద్యార్థి దశ మీ జీవితానికి అత్యంత కీలకమైన పునాది. ఈ సమయంలో తెలియని ఆకర్షణలకు లోనై గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడితే మీ భవిష్యత్తు అంధకారమయమవుతుంది .ఇది కేవలం మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, మీ కుటుంబాన్ని, మీ కలలను కూడా నాశనం చేస్తుంది. పోలీసులు మీ శ్రేయోభిలాషులు. ఎన్.డి.పి.ఎస్ యాక్ట్ చాలా కఠినమైనది, ఒకసారి ఈ కేసులో చిక్కుకుంటే జీవితాంతం దాని పర్యవసానాలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి, మీరంతా చైతన్యవంతులై, మీ స్నేహితులను కూడా ఈ వ్యసనం వైపు వెళ్లకుండా కాపాడాలి అని హితవు పలికారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా, గంజాయి దుష్ప్రభావాలను కళ్ళకు కట్టినట్లు చూపే దృశ్యరూపక వీడియోలను ప్రదర్శించి, వారిలో బలమైన అవగాహన కల్పించారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్టేషన్ ఆవరణలలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణతో పాటు, విద్యార్థులలో సామాజిక బాధ్యతను పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొన్నారు.
సర్కిల్ పరిధిలో గంజాయి రహితంగా మార్చేందుకు పోలీస్ శాఖ అహర్నిశలు శ్రమిస్తోందని, ఇందులో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతిరోజూ వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని సిఐ తెలిపారు. ప్రజల చైతన్యం, సహకారంతోనే గంజాయిని పూర్తిగా నిర్మూలించగలమని, తద్వారా నేరరహిత సమాజాన్ని స్థాపించగలమని ఆయన గట్టిగా విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమoలో మాదారం ఎస్సై సౌజన్య, శిక్షణ ఎస్ఐ అనూష, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలలో పతకాలు సాధించిన బెల్లంపల్లి విద్యార్థులు.

Chief Editor: Satish Kumar

పుస్తకాలోచ్చాయి, పాఠశాలలు తెరిచే నాటికి పంపిణీ కి చర్యలు

Share this