*గాలి మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్*
**ఎలక్షన్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కాంగ్రెస్ పార్టీ*
*ఎలక్షన్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి*
*ఎంసిపిఐయు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ డిమాండ్*
ఎంసీపీఐయు పార్టీ కార్యాలయంలో బెల్లంపల్లి స్థాయి విస్తృత సమావేశంలో ఎం సి పి ఐ యు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శిపసులేటి వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు సాధ్యపడని హామీలు ఇచ్చి ప్రజలను నట్టేట ముంచారని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజల బతుకులు మారుతాయి అని అనుకుంటే ప్రజల నోట్లో బెల్లం పెట్టి కంట్లో కారంచల్లే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది 6 గ్యారంటీ ల పేరుతో ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి ఇంతవరకు కూడా అమలు చేయకపోవడం అనేది చాలా సిగ్గుచేటు వికలాంగులకు పెన్షన్ పెంపుదల, వితంతువులకు, వృద్ధులకు, ప్రతి ఇంటికి మహిళకు2500 పెన్షన్, కళ్యాణ లక్ష్మి లో లక్ష రూపాయల నగదు తో పాటు తులం బంగారం, చదువుకున్న మహిళకు స్కూటీ, ఉచిత గ్యాస్, రైతుబంధు, రైతు భరోసా అలాగే నిన్నగాక మొన్న రాజీవ్ యువ వికాసం పేరుతో లోన్లు ఇస్తామని, ఆ తర్వాత సివిల్ స్కోర్ ఉంటేనే రాజీవ్ యువ వికాసం స్కీం వర్తిస్తుందని స్వయంగా అధికారులు చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది ఇంకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ప్రభుత్వ పథకాలు తీసుకువచ్చి మధ్యలో ఆపివేస్తాయో చూడాలి ప్రభుత్వాలు మారినా పాలకులు మారిన బడుగు బలహీన వర్గాల ప్రజల బ్రతుకులు మాత్రం మారడం లేదని 18 నెలలు కావస్తున్నా కూడా ఎలక్షన్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం అనేది చాలా సిగ్గుచేటు ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ సర్కార్ ఎలక్షన్లలో ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని లేనియెడల ఎం సిపిఐ యూ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న ఈ కార్యక్రమంలోజిల్లా మహిళా కార్యదర్శి దుర్గం లక్ష్మి, సబ్బని రాజశేఖర్, రాజ్ కుమార్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.