Praja Telangana
తెలంగాణ

తెలంగాణలో రేపటి నుంచి రాజీవ్ యువ వికాసం*

*తెలంగాణలో రేపటి నుంచి రాజీవ్ యువ వికాసం*

హైదరాబాద్:జూన్ 01
తెలంగాణలో రాజీవ్ యువ వికాసం స్కీమ్ లో భాగంగా జూన్ 2 వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మంత్రులు ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలు అందించనున్నారు.

పెట్టుబ‌డి సాయం లేక వెనుక‌బ‌డిన ల‌క్షలాది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ‌ర్గాల‌ కు చెందిన‌ యువ‌కుల‌కు అండ‌గా నిలిచేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ‌ కాంగ్రెస్ ప్రభు త్వం రాజీవ్ యువ వికాసం ప‌థ‌కాన్ని ప్రవేశపెట్టింది.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పుర‌స్క రించుకొని జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్ యువ వికాసం ప‌థ‌కాన్ని ప్రారం భించ‌నున్నారు.

ఈ పథకంలో ఎంపికైన లబ్ధిదారులకు సోమవారం నుంచి రుణ మంజూరు పత్రాలు జారీచేయడానికి కాంగ్రెస్ సర్కార్ ఏర్పాట్లు చేసింది. ఈ ప్రక్రియను జూన్ 9వరకు కొనసాగించ నుంది. అలాగే జూన్ 10 నుంచి 15 వ‌ర‌కు జిల్లా, నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో వారికి శిక్షణ‌ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ల‌బ్ధిదారులు ఎంచుకున్న రంగంలో వారికి నైపుణ్యాలు మెరు గుప‌ర‌చ‌డానికి ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు.

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ‌ర్గాల‌కు చెందిన‌ నిరుద్యోగ యువతకు ఆర్థిక చేయూతనందించి తమ కాళ్లపై తాము నిలబడేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్​ యువ వికాసం పథకాన్ని తీసుకురాగా.. ఈ ప‌థ‌కానికి రాష్ట్రవ్యాప్తంగా యువతి, యువ‌కుల నుంచి పెద్ద ఎత్తున స్పంద‌న ల‌భించింది.

16.22 ల‌క్షల మంది త‌మ వ్యాపార ఆలోచ‌న‌ల‌కు రూపం ఇచ్చేందుకు స‌బ్సీడీతో కూడిన పెట్టుబ‌డి సాయం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాదికి ఈ పథకం కింద 5 ల‌క్షల మంది అర్హుల‌ను ప్రభుత్వం ఎంపిక చేయ‌నుంది. దీని కోసం రూ.6వేల 2వందల 50 కోట్ల నిధుల‌ను కేటాయించింది.

ఇందులో భాగంగా మొదటి విడతలో జూన్ 2న రూ.లక్షలోపు యూనిట్లకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలని నిర్ణయించింది. రూ.50 వేల వ‌ర‌కు వంద శాతం, రూ.ల‌క్ష వ‌ర‌కు 90 శాతం, రూ.2 లక్షల వ‌ర‌కు 80 శాతం, రూ.4 ల‌క్షల వ‌ర‌కు 70 శాతం రాయితీ కింద రుణాలు మంజూరు చేయ‌నున్నారు.

Related posts

బెల్లంపల్లి రోడ్ల దుస్థితి

Chief Editor: Satish Kumar

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధికారుల సమన్వయంతో చర్యలు

Share this