తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు
హైదరాబాద్:మే 22
తెలంగాణ జిల్లాల్లో గురువారం సాయంత్రం నుండి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది, అప్పటి వరకు ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలకు ఒక్కసారిగా కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం కలిగించింది
రాత్రి కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబా బాద్, వరంగల్, హన్మకొండ, జనగాం,సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామా రెడ్డి, జిల్లాలతో పాటు.మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారా యణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడ క్కడా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.
జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని హెచ్చరించింది.