రాజీవ్ గాంధీ, ఆశయాలను,కొనసాగించాలి ఎమ్మెల్యే గడ్డం వినోద్
రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నవభారత నిర్మాత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ . ఈ సందర్భంగా ఎమ్మెల్యే, మాట్లాడుతూ దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి పరిచయం చేసిన సాంకేతిక పరిజ్ఞానమే దేశాన్ని రక్షణ కవచముల నేటికీ కాపాడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగించాలని వారి బాటలోనే క్రమశిక్షణతో ఉండాలని సూచించారు
ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని లబ్ధిదారుల వద్ద డబ్బులు వసూలు చేస్తే పార్టీ నుండి ఆ క్షణమే తొలగిస్తామని నాయకులను, కార్యకర్తలను హెచ్చరించారు. తమ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో తాము వెనుకబడి ఉన్నామని దాన్ని ఇకనుండి మెరుగుపరుచుకుంటామని తెలిపారు.