*రాష్ట్ర ప్రభుత్వ “వాల్టా” చట్టం అథారిటీ సభ్యులుగా యోగేశ్వర్.*
మంత్రి సీతక్క ఆధ్వర్యంలో బాధ్యతల స్వీకరణ.
తేదీ: 20.05.2025.
నీటి వనరులు, నేల ,చెట్లు, పర్యావరణ సంరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి “వాల్టా ” WALTA అథారిటీ మండలిలో మంచిర్యాల జిల్లాకు చెందిన పర్యావరణ వేత్త, గుండేటీ యోగేశ్వర్ కు అరుదైన చోటు ప్రభుత్వం కల్పించింది.
ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రత్యేక సమావేశంలో పాల్గొని “వాల్టా” చట్టం రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేయడానికి, మరియు నీటి వనరులు, అడవులు, నేల, పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యల పై పలు విలువైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన కలిగించే పలు కరపత్రాల రూపకల్పనపై తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.
అనంతరం “వాల్టా ” WALTA చట్టం అమలకు ఉపయోగపడే మంచిర్యాల జిల్లాలోని వివిధ మండలాల్లో ఉన్న నీటి వనరులు, అటవీ విస్తీర్ణం అంశాలపై రాసిన మంచిర్యాల జిల్లా స్వరూపం పుస్తకాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపిక చేసిన రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖల ముఖ్య కార్య దర్శలు,ఐ.ఏ ఎస్,ఐ.ఎఫ్.ఎస్ అధికారులు, పర్యావరణవేత్తలు శాస్త్రవేత్తలు ,పాల్గొన్నారు.
ఈ ఈ సందర్భంగా మంత్రి సీతక్క యోగేశ్వర్ చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందించారు.
రాష్ట్ర ప్రభుత్వం మండలి సభ్యులుగా సందర్భంగా పర్యావరణ ప్రేమికులు, జిల్లా అధికారులు, పలు రంగాల ప్రముఖులు అభినందించారు.