Praja Telangana
తెలంగాణ

నూతన బదిలీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి.

నూతన బదిలీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి.

సింగరేణి యాజమాన్యం విడుదల చేసిఐన నూతన బదిలీ విధానాన్ని నిరసిస్తూ ఐఎన్టియుసి సెక్రటరీ జనరల్, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ శ్రీ బి జనక్ ప్రసాద్, ఆదేశానుసారం సింగరేణి వ్యాప్తంగా యాజమాన్యం తీసుకువచ్చిన నూతన బదిలీ విధానాన్ని నిరసిస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా మందమరి ఏరియాలోని కాసిపేట 1 ఇంక్లైన్ గని పై కార్మికులతో కలసి నల్ల బ్యాడ్జిలను ధరించి నిరసన వ్యక్తం చేస్తూ మేనేజర్ భూశంకరయ్య కి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్నికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఐఎన్టియుసి ఏరియా వైస్ ప్రెసిడెంట్ దేవి భూమయ్య మాట్లాడుతూ, కార్మికుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తీసుకువచ్చిన కొత్త బదిలీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఐ ఎన్ టి యు సి డిమాండ్ చేస్తున్నదనీ, తెలిపారు.సింగరేణి మేనేజ్మెంట్ ఇటీవల విడుదల చేసిన బదిలీ నిబంధనల సర్క్యులర్ నంబర్ 811 పూర్తిగా కార్మికుల అభ్యున్నతికి వ్యతిరేకంగా ఉన్నదనీ తెలిపారు.ఉద్యోగ జీవితంలో కేవలం రెండు సార్లు మాత్రమే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్‌కు అవకాశం ఇవ్వడం,పర్మనెంట్ ఉద్యోగి బదిలీ కోసం కనీసం 3 సంవత్సరాల సేవ అవసరమన్న నిబంధన, కీలక పోస్టుల్లో ఇప్పటికే పని చేసిన ఉద్యోగులను మళ్లీ నియమించరాదన్న నిబంధన,మ్యూచువల్ ట్రాన్స్ఫర్‌కు 10 సంవత్సరాల లోపు సంబంధిత ఏరియాలో పని చేసిన అనుభవం ఉండకూడదన్న నిబంధన ఇవన్నీ సింగరేణి చరిత్రలో ఎన్నడూ ఇటువంటి సర్క్యులర్ లేదని, ఈ విధానాలు ఉద్యోగులల్లో తీవ్రమైన మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాయని, కుటుంబ జీవితం, ఉద్యోగ భద్రతపై ప్రతికూల ప్రభావం చూపుతూ సంస్థ ఉత్పత్తి పై కూడా ప్రభావం చూపే అవకాశమున్నందున కార్మికుల మనోభావాలను గౌరవించకుండా, గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలతో సంప్రదించకుండా తీసుకొచ్చిన ఈ సర్క్యులర్‌ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బన్న లక్ష్మన్ దాస్,ఆర్గనైజింగ్ సెక్రెటరీ,ఐఎన్టీయూసీ సెంట్రల్ కమిటీ,పిట్ సెక్రెటరీ శనిగారపు రవీందర్, సోగల కన్నయ్య, కనుకుంట్ల దినేష్,సంపత్, ఏ శ్రీకాంత్, రాజ్ కుమార్, శ్రీకాంత్ ,అలీ ,రోహిత్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అంతర్జాతీయ అందాల పోటీలను సందర్శించే అవకాశం లభించడంపై ఆనందం వ్యక్తపరచిన స్థానిక విద్యార్థి.

బి.సి ఢిక్లరేషన్ హామీలను అమలు చేయాలి

ఎంబీసీ డిఎన్టి ల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

Share this