Praja Telangana
తెలంగాణ

బ్యాంకు ల ఆధ్వర్యంలో షేడ్ వేయండి. పార్కింగ్ కల్పించండీ.

బ్యాంకు ల ఆధ్వర్యంలో షేడ్ వేయండి.
పార్కింగ్ కల్పించండీ.

వాహనాలకు పోలీసుల చలాన్లు తప్పించండి.

తాండూరు మండలంలో గల తెలంగాణ దక్కన్ గ్రామీణ బ్యాంక్ యూనియన్ బ్యాంకు, ఎస్ బీ ఐ ల అధికారులు బ్యాంక్ నియమాలకు విరుద్ధంగా నిల్చోవడానికి, వాహనాల పార్కింగ్ కు,కూర్చోవడానికి నీడ లేక, బ్యాంకు ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తాండూర్ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ తెలిపారు. ఈ విషయమై సోమవారం న తాండూర్ డిప్యూటీ తాసిల్దార్ ప్రసాద్ కు వినతిపత్రం అందజేసి తదనంతరం వారు మాట్లాడుతూ ఈ రెండు బ్యాంకులలో సుమారు 20 వేలకు పైగా ఖాతాదారులు ఉన్నారని అలాగే ప్రభుత్వ ప్రైవేటు ఖాతాదారులు కలిగిన ఈ బ్యాంకులలో ఎండా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని చల్లని నీరు బ్యాంకు ముందర ప్రజలు కూర్చోవడానికి వీలు కల్పిస్తూ అలాగే బయట కాని వెనుక కాని వాహనాలు నిలుపుకోవడానికి ఎండ పడకుండా వచ్చేది వర్షాకాలం కాబట్టి రైతులు రుణాల కోసం వస్తారు. గంటల తరబడి వేచి వుండాల్సి వస్తుంది. కావున ఒక షెడ్డు కానీ లేదా ఇప్పుడు తాత్కాలికంగా ఓక గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయాలని అలాగే బ్యాంకు ముందర వాహనాలు నిలపడంతో పోలీసులు చలాన్లు వేస్తున్నారని ఈ చలాన్ల బాధ తప్పే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే బీసీ పాయింట్లు ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేయాలని తద్వారా వృద్ధులకు వికలాంగులకు గ్రామాలలోనే నగదు అందుబాటులో అందుతుందని అలాగే బ్యాంకు నియమ నిబంధనలు పాటించని బ్యాంకు మేనేజర్లపై కలెక్టర్కు, బ్యాంకు ఆర్ఎం కు సిఫార్సు చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాము. అని తెలిపారు

Related posts

వర్కింగ్ జర్నలిస్టులకు సింగరేణి క్వార్టర్లు కేటాయించండి

కేంద్ర కార్మిక సంఘాల వేదిక దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జూలై 9 కి వాయిదా

Chief Editor: Satish Kumar

బి.సి ఢిక్లరేషన్ హామీలను అమలు చేయాలి

Share this