బెల్లంపల్లి ఎమ్మార్వో గా బాధ్యతలు తీసుకున్న కృష్ణ
బెల్లంపల్లి నూతన ఎమ్మార్వో గా కృష్ణ శనివారం బాధ్యతలు తీసుకున్నారు. కార్యాలయ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని ప్రభుత్వ భూముల పరిరక్షణకు కృషి చేస్తానని, భూ సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ తనకు పూర్తి సహకారం అందించాలని కోరారు భూ సమస్యలు ఏమున్నా తమ వద్దకు వచ్చే ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు ప్రజా సమస్యలు పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా వారు తెలిపారు