Praja Telangana
తెలంగాణ

అంతర్జాతీయ అందాల పోటీలను సందర్శించే అవకాశం లభించడంపై ఆనందం వ్యక్తపరచిన స్థానిక విద్యార్థి.

అంతర్జాతీయ అందాల పోటీలను సందర్శించే అవకాశం లభించడంపై ఆనందం వ్యక్తపరచిన స్థానిక విద్యార్థి.

తెలంగాణ ప్రభుత్వ పర్యవేక్షణలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో మే 10 నుండి 31 వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ అందాల పోటీలో,తెలంగాణ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా క్రీడలను వీక్షించే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా, షేక్‌పేట్ సీఓఈ లో చదువుతున్న బెల్లంపల్లి పట్టణానికి చెందిన ప్రథమ్ పాండే మే 10న క్రీడలను వీక్షించాడు. తిరిగి అవకాశం లభించడంతో శనివారం క్రీడలను వీక్షించాడు. ఈ సందర్భంగా ప్రథమ్ పాండే అంతర్జాతీయ స్కేటింగ్ క్రీడాకారుడు అర్జున్ అవార్డు గ్రహీత తేజస్ పడిగను కలిసి తమ అనుభవాలను వ్యక్త పరిచాడు. అంతర్జాతీయ క్రీడలను సందర్శించే అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, TGSWREIS కార్యదర్శి అలుగు వర్షిణికి, ప్రిన్సిపాల్ బాలస్వామికి,కళాశాల ఉపాధ్యాయులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

కేంద్ర కార్మిక సంఘాల వేదిక దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జూలై 9 కి వాయిదా

Chief Editor: Satish Kumar

వర్కింగ్ జర్నలిస్టులకు సింగరేణి క్వార్టర్లు కేటాయించండి

Share this