తెలంగాణ ఆర్ ఎం పి & పి ఎం పి వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నిక
అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా మొండయ్య,విజయ్*
మంచిర్యాల,
తేది:16,మే,2025.
తెలంగాణ ఆర్ఎంపి & పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ ని ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షులు మొండయ్య తెలిపారు. ఈ సందర్భంగా మొండయ్య మాట్లాడుతూ గత 11 సంవత్సరముల నుండి మంచిర్యాల జిల్లాలో ఈ కమిటీ కొనసాగుచున్నది తెలిపారు. దానిలో భాగంగా ఆర్ఎంపి అండ్ పి.ఎం.పి ఐక్యత కొరకు వారి సమస్యలపై పనిచేస్తున్నాం అని తెలిపారు. మహాసభలు నిర్వహించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఆర్ఎంపి& పి.ఎం.పి ల సమస్యల పైన చర్చలు జరిపి మన పరిధి లొనే ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటిస్తూ ప్రాథమిక వైద్యం చేయవలెనని అవగాహన కార్యక్రమాలు నిర్వహించటం జరిగింది అని అన్నారు. కమిటీ జిల్లా అధ్యక్షులు గా దొంతుల మొండయ్య, ఉపాధ్యక్షులు ఎస్. రాము చారి, ప్రధాన కార్యదర్శి మేడిపల్లి విజయ్, కోశాధికారి గా తంగేళ్లపల్లి రాజేందర్, సహాయ కార్యదర్శి కొయ్యల రాజు, గౌరవ అధ్యక్షులు డిఆర్ బెంజిమెన్, ముఖ్య సలహాదారుగా కుంచాల శంకరయ్య ఇది మంచిర్యాల జిల్లా కమిటీ అధ్యక్షులు మొండయ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది.