Praja Telangana
తెలంగాణ

ఎంబీసీ డిఎన్టి ల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

ఎంబీసీ డిఎన్టి ల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎంబీసీ డిఎన్టి ల న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించడం కొరకు జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో డిమాండ్ల వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో ఏవో రాజేశ్వర్ కు అందజేయడం జరిగింది.ఈ డిమాండ్ల వినతి పత్రంలో పొందుపరిచిన విషయాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
1.సంచార కులాలకు అనగా డిఎన్టియులకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాలి
2. రాజ్యాంగంలోని మూడవ షెడ్యూల్లో సంచార కులాలను చేర్చాలి
3. బీసీ ఎంబీసీడీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేయాలి
4. ఎంబీసీ డిఎన్టియుల స్థితిగతులపై బీసీ కమిషన్ చే అధ్యయనం చేయించి అందుకు అనుగుణంగా వారి అభివృద్ధికై త్వరితగతిన చర్యలు తీసుకోవాలి
5. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంబీసీ మంత్రిత్వ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి అలాగే డిఎన్టియులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
6. దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలి దీనితో సంచార జాతర కులాలకు కూడా స్థానిక సంస్థలలో అవకాశాలు మెరుగుపడతాయి అని డిమాండ్ చేస్తున్నాము అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, సంచార జాతర సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు వైద్య భాస్కర్, తెలంగాణ గంగా పుత్రుల సంఘం జిల్లా అధ్యక్షులు నేనెలా నరసయ్య, జాతీయ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేరాల వంశీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాళ్ల హరీష్ గౌడ్, బీసీ నాయకులు శాఖ పూరి భీమ్సేన్ శ్రీపతి రాములు, వేముల కిరణ్ తదితరులు పాల్గొన్నారు

Related posts

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ ఘనంగా జయంతి వేడుకలు

జబ్బలు సరిసిందెవరు …బొమ్మ గడియారాలు ఇచ్చింది ఎవరు…!కల్లూరు సభలో స్థానిక నేతలపై కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు

ఎంబీసీ డిఎన్టి ల న్యాయబరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

Chief Editor: Satish Kumar
Share this