కుల గణన సాధించడంలో కీలక పాత్ర పోషించిన బీసీ ఉద్యమకారుడు గుమ్ముల శ్రీనివాస్ కి సన్మానం
* 50% రిజర్వేషన్ లక్ష్యసాధనగా పనిచేస్తానని హామీ
నేటి ప్రజాతెలంగాణ:మంచిర్యాల మే 2
మంచిర్యాల పట్టణంలోని జన్మభూమి నగర్ లో జాతీయ బిసి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు అయిన గుమ్ముల శ్రీనివాస్ ని సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా బీసీల రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా,సాధన ధ్యేయంగా పోరాడుతున్న బీసీ ఉద్యమ నేత,అలాగే రాష్ట్రంలో స్థానిక సంస్థల బిసి రిజర్వేషన్ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ కుల గణన చేపట్టాలని పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం జనగణలో భాగంగా బీసీ కుల గణన చేపట్టాలని అనేక రూపాల్లో ఉద్యమ ఆకాంక్షను వెల్లిబుచ్చిన ఉద్యమకారులని సన్మానించడం ఆనందదాయకం అని పేర్కొన్నారు.అనంతరం సన్మాన గ్రహీత గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ నాతోటి బిసి ఉద్యమకారులు నన్ను సన్మానించడం ఆనందంగా ఉందా అని తెలిపారు. అంతేకాకుండా నా పై మరింత బాధ్యత పెరిగిందని భావిస్తూ రాబోయే రోజుల్లో విద్య ఉద్యోగాల్లో చట్టసభలు 50% రిజర్వేషన్ సాధన లక్ష్యంగా పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రఘునందన్,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పల్లె భూమేష్, సీనియర్ న్యాయవాది కర్ర లచ్చన్న, నాయకులు శాఖ పురి భీమ్సెన్,శ్రీపతి రాములు,పంపరి వేణుగోపాల్, కీర్తి బిక్షపతి, కొత్తకొండ రమేష్, అక్కల రమేష్,వైద్య భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.