Praja Telangana
తెలంగాణ

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉప్పులేటి నరేష్

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉప్పులేటి నరేష్

-నియామక పత్రం అందజేసిన జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య

నేటి ప్రజా తెలంగాణ, మందమర్రి టౌన్,

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా మందమర్రి పట్టణానికి చెందిన ఉప్పులేటి నరేష్ నియమించారు. శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో నియామక పత్రాన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం (రి. నెం.1033/77) జాతీయ స్థాయిలో పనిచేస్తున్న ఏకైక సంఘమని 16 రాష్ట్రాల్లో విస్తరించిందని అణగారిన వర్గాలకు అండగా నిలిచేందుకు కృషీ చేస్తుందని అన్నారు. దీనిలో భాగంగా మంచిర్యాల జిల్లాలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కమిటీని నిర్మాణం చేసేందుకు కమిటీలు వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఐడియాలజీ గ్రామ గ్రామాన తీసుకెళ్లేందుకు జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉప్పులేటి నరేష్ ను నియమిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్, సీనియర్ జర్నలిస్ట్ బొంకూరు మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్, కాంపెల్లి సతీష్, సీనియర్ నాయలు రాజన్న మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నెరువట్ల రాజలింగు, జిల్లా ఉపాధ్యక్షులు ఆసంపల్లి శ్రీనివాస్, ఇతర నాయకులు పాల్గోనగా జిల్లా ప్రధాన కార్యదర్శి గా నియామకమైన ఉప్పులేటి నరేష్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకు ఈ బాధ్యతలను ఇచ్చిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు ఎస్. వరుణ్ కుమార్, జాతీయ ఉపాధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు కాడారం అరుణ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నెరువట్ల రాజలింగుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ను జిల్లాలో పటిష్టం చేసి భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ బి. ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ఎస్. సి, ఎస్. టి, బి. సీ, మైనారిటీల ఐఖ్యతకు కృషీ చేస్తానని ఆయన తెలిపారు.

Related posts

సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలలో పతకాలు సాధించిన బెల్లంపల్లి విద్యార్థులు.

Chief Editor: Satish Kumar

Share this