ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఏదునూరి రమేష్ నియామకం
జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తా ఏదునూరి రమేష్
నేటి ప్రజాతెలంగాణ:మంచిర్యాల
మంచిర్యాల జిల్లా ధర్మసమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎదునూరి రమేష్ ను నియమిస్తున్నట్లుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విశారదన్ మహరాజ్ ఒక ప్రకటనలో శనివారం తెలియడం జరిగింది.ఈ సందర్భంగా ఏదునూరి రమేష్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా ధర్మసమాజ్ పార్టీజిల్లా అధ్యక్షుడుగా నన్ను నియమించినందుకు రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లుగా పేర్కొన్నారు.అంతేకాకుండా జిల్లాలో పార్టీని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని మండలాల్లో గ్రామాల్లో బలోపేతం చేస్తానని,పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని తెలిపారు.అదేవిధంగా త్వరలోనే మంచిర్యాల జిల్లాలో జరగనున్న మాభూమి రథయాత్రను జిల్లాలో జయప్రదం చేస్తామని తెలియజేశారు.అనంతరం నాయకులు నూతనంగా ఎన్నికైన రమేష్ ను శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ధర్మసమాజ్ పార్టీ నాయకులు రామస్వామి,రేగుంట రాకేష్,నందిపాటి రాజు, చంద్రశేఖర్,బీసీ నాయకులు సదానందం, సాయి రేణి బాబురావు, పెయింటింగ్ సంఘం అధ్యక్షులు ఎండి జమీర్,ఎండి రఫీ తదితరులు పాల్గొన్నారు