Praja Telangana
తెలంగాణ

ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో

నేటి ప్రజాతెలంగాణ:బెల్లంపల్లి

ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు నాగుల కిరణ్ బాబు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల వద్ద గల మహనీయులు మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి పురస్కరించుకొని పూల మాల వేసి, కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్, మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే గొప్ప సంఘసంస్కర్త, వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసిన మహాయోధుడని, విద్య యొక్క ప్రాముఖ్యతను తెలిపిన మహాత్ముడు అని కొనియాడారు ముల్కల్ల రాజేంద్రప్రసాద్. ఉపాధ్యక్షులు నాగుల కిరణ్ బాబు, బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షులు దాగం శ్రీనివాస్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే ఆశయంతో ముందుకు సాగుతామన్నారు.ఈ కార్యక్రమానికి మందమర్రి పట్టణ అధ్యక్షులు గాజుల శంకర్,సతారపు నారాయణ, దుర్గం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు

Related posts

అంతర్జాతీయ అందాల పోటీలను సందర్శించే అవకాశం లభించడంపై ఆనందం వ్యక్తపరచిన స్థానిక విద్యార్థి.

మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ ఎన్నిక

కేంద్ర కార్మిక సంఘాల వేదిక దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జూలై 9 కి వాయిదా

Chief Editor: Satish Kumar
Share this