తుడుం దెబ్బ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి
నేటి ప్రజాతెలంగాణ:మంచిర్యాల
మంచిర్యాల జిల్లా కేంద్రంలో తుడుం దెబ్బ రాష్ట్ర మహా సభలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేసిన ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు మరియు జల్లా నాయకులు విడుదల చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ,రాష్ట్ర మహా సభలను ఈనెల 12,13,14 తేదీలలో కుమురం భీమ్, ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలం కొమురం భీమ్ యుద్ధ భూమి జోడేఘాట్ లో, నిర్వహించడం జరుగుతుందని, ఈ రాష్ట్ర మహా సభలకు తెలంగాణ రాష్ట్రము లోని, అన్ని జిల్లాలలోని మండల డివిజన్ కమిటీ లు, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ బాధ్యలు మరియు అనుబంధ సంఘాల తుడుం దెబ్బ నాయకులు హాజరై ఆదివాసీల అస్తిత్వం పై కొనసాగుతున్న దమణ కాండకు వ్యతిరేకంగా పోరాటాలు చేసందుకు భవిష్యత్ కార్యాచరణ చేయటం జరుగుతుందని తెలిపారు. ఆదివాసీల, మనుగడ ను కోల్పోతున్న,ఆదివాసీ సమూహాన్ని చైతన్య పరచి భారత రాజ్యాంగం లోని ఆదివాసీ హక్కులు, చట్టాలను అమలు జరిగేందుకు దశల వారిగా ఉద్యమాలు కొనసాగించాలని, రాష్ట్రము లో ఆదివాసీల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారి తీవ్ర నిరాశ కు గురైందని అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం చేస్తున్నాయని, ఆదివాసీల భూములు పరాయి వారికి గురైనాయని,ఆదివాసీలకు విద్యా,ఉద్యోగ, ఉపాధి అభివృద్ధి రంగాలలో ఎలాంటి పురోగతి లేదని, రాజకీయ పార్టీలు కేవలం ఆదివాసీలను ఓటు బ్యాంక్ గానే చూస్తున్నాయని, రాష్ట్రము లోని ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్య లను చట్ట సభల్లో ఏకరువు పెట్టవల్సిన ప్రజా ప్రతినిధులు పూర్తిగా విఫలం అయినారని, ఆదివాసీల పై జరుగుతున్న దాడులు కుట్రలను తిప్పికొట్టెందుకు ఆదివాసులు సంసిద్ధం కావాలని సంకల్పిస్తూ జోడెన్ ఘాట్ లో తుడుందెబ్బ రాష్ట్ర మహా సభలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ మహా సభలకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా తుడుం దెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ కుడిమెత తిరుపతి, సోయం జంగు మాట్లాడుతూ
తుడుం దెబ్బ రాష్ట్ర మహాసభలకు తెలంగాణ రాష్ట్రంలోని తుడుం దెబ్బ రాష్ట్ర జిల్లా మండల అనుబంధ సంఘాల నాయకులందరూ అధిక సంఖ్యలో పాల్గొని రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో
తుడుందేబ్బ రాష్ట్ర కో కన్వీనర్ కుడిమెత తిరుపతి
తుడుందేబ్బ రాష్ట్ర కో కన్వీనర్ సోయం జంగు,
మంచిర్యాల తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి కనకరాజు
తోటి సేవ సంఘం జిల్లా అధ్యక్షులు. వల్క. చిలుకయ్య
తుడుందెబ్బ జిల్లా కార్యదర్శి ఆత్రం.అరుణ్ కుమార్
తుడుం దెబ్బ కాసిపేట మండల అధ్యక్షుడు సండ్ర. భూమన్న, మంచిర్యాల జిల్లా కార్యదర్శి తట్ర.అర్జున్
ఆత్రం సాగర్ తోటి నాయకులు
శ్రీదేవి మహిళా నాయకురాలు
ఆత్రం మురళి గ్రామ పటేల్
మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు.