*సి సి రోడ్డు పక్కలకు మట్టి వేయాలి*
బెల్లంపల్లి నియోజకవర్గం తాండూరు మండలంలో వివిధ గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతుండడం అభినందించదగ్గ విషయమని ఆలాగే ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాలలో కూడా సిసి రోడ్లు వేయాలని తెలుగుదేశం పార్టీ తాండూర్ మండల అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ తెలిపారు .
కిష్టంపేట, తంగళ్ళపల్లి వివిధ గ్రామాలలో కాస్త చిన్నగా ఉన్న రోడ్లలో సిసి రోడ్లు వేయడం లేదని అక్కడి గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అలాగే సిసి రోడ్లు పూర్తయిన కొన్ని గ్రామాలలో రోడ్లకు ఇరువైపులా మట్టి వేయకపోవడం వలన రెండు వాహనాలు ఎదురెదురుగా వెళ్లినప్పుడు వాహనాలు రోడ్డు దిగడంతో ఇబ్బందులు పడుతున్నారని
అలాగే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఈ విషయమై చర్యలు తీసుకోవాలని తాండూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి
ఎంపిడివో శ్రీనివాస్ కు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగిందని దాసరి శ్రీనివాస్ ఓక ప్రకటలో తెలిపారు.