Praja Telangana
తెలంగాణ

తెలంగాణ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ చిత్ర ప్రదర్శనకు చిప్పకుర్తి శ్రీనివాస్ చిత్రం ఎంపిక

తెలంగాణ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ చిత్ర ప్రదర్శనకు చిప్పకుర్తి శ్రీనివాస్ చిత్రం ఎంపిక…

నేటి ప్రజాతెలంగాణ:మంచిర్యాల

మంచిర్యాల జిల్లా…
జనవరి 25, 26 తేదీలలో ప్రముఖ చిత్రకారుడు,శిల్పి ఏలూరి శేషబ్రహ్మం కాకతీయ శిల్ప సంపద గురించి తెలుసుకోవడానికి నిర్వహించిన కాకతీయ టెంపుల్ స్కెచింగ్ స్టడీ టూర్ లో సుమారు రెండు తెలుగు రాష్ట్రాల నుండి 60 మంది ఆర్టిస్టులు పాల్గొనగా, వారు వేసిన వందల చిత్రాల నుండి ఎంపిక కాబడిన చిత్రాలతో ఈ నెల 12 నుండి 14 తేదీల వరకు హైదరాబాద్ మాదాపూర్ లోని తెలంగాణ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నిర్వాహకులు గొప్ప ప్రదర్శన ఏర్పాటు చేయబోతున్నారు. మంచిర్యాల జిల్లాకు చెందిన చిత్రకారుడు చిప్పకుర్తి ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ చిప్పకుర్తి శ్రీనివాస్ వేసిన చిత్రం హైద్రాబాద్ లో జరిగే ప్రదర్శనకు ఎంపిక అయింది. ఆయన వేసిన చిత్రం మూడు రోజుల పాటు ప్రదర్శనలో ఉంచనున్నారు. శ్రీనివాస్ మాట్లాడుతూ… తెలంగాణ గడ్డ మీద పుట్టిన నాకు కాకతీయ శిల్ప సంపదపై ఉన్న అభిమానానికి నేను వేసిన చిత్రం ఎంపిక కావడం నాకు గర్వకారణం అని తన సంతోషాన్ని మీడియా తో పంచుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు…

Related posts

నూతన బదిలీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి.

తెలంగాణ సచివాలయ సందర్శన లోప్రపంచ ముద్దుగుమ్మలు*

Share this