Praja Telangana
తెలంగాణ

ఘనంగా వివేకవర్ధిని డిగ్రీ కళాశాల వీడ్కోలు సమావేశం

ఘనంగా వివేకవర్ధిని డిగ్రీ కళాశాల వీడ్కోలు సమావేశం

మంచిర్యాల, ఏప్రిల్ 7, నేటి ప్రజా తెలంగాణ

మంచిర్యాల వివేకవర్ధిని పీజీ & డిగ్రీ కళాశాల ప్రేమపూర్వక వీడ్కోలు సమావేశాన్ని సోమవారం మందమర్రి పట్టణంలోని సాయిమిత్ర గార్డెన్ లో హుషారెత్తించిన నృత్యాలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ చంద్రమోహన్ గౌడ్ ఉదారీ మాట్లాడుతూ చదువు చెప్పిన గురువులను తోటి విద్యార్థులను ఎన్నటికీ మరువరాదని అన్నారు. ఉన్నత చదువులు చదివి కళాశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని విద్యార్థులకు సూచించారు. నిరంతర కృషి క్రమశిక్షణతోనే విజయం సాధించవచ్చని, ఓర్పు అంకితభావంతో కష్టపడి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరచాలని విద్యార్థులను చైతన్యపరిచి వారి భవిష్యత్తుకు ఆశీస్సులు అందించారు. కోల్ బెల్ట్, పారిశ్రామిక ప్రాంతమైన మంచిర్యాల జిల్లాలో వివేకవర్ధిని పీజీ & డిగ్రీ కళాశాలలో అత్యుత్తమమైన విద్యతోపాటు విద్యార్థికి ఉద్యోగ సాధనకు అవసరమైన నైపుణ్యాన్ని, అత్యుత్తమైన ఉపాధ్యాయులచే అందించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఈ సమావేశంలో హుషారెత్తించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, అధ్యాపకులు సతీష్, రాజేష్, శారీన, శ్రీలేఖ, సమీర్, చైతన్య, రాజేష్ వంశీ, చిరంజీవి, పవిత్ర, నేహా, కీర్తన, తాజ్ బాబా కళాశాల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Related posts

బెల్లంపల్లి వన్ టౌన్ పరిధిలో సీసీ కెమెరాలు ప్రారంభించ ఏసిపి & వన్ టౌన్ ఎస్ హెచ్

రాష్ట్ర ప్రభుత్వ “వాల్టా” చట్టం అథారిటీ సభ్యులుగా యోగేశ్వర్.* మంత్రి సీతక్క ఆధ్వర్యంలో బాధ్యతల స్వీకరణ.

ఇక గ్యాస్ సిలిండర్ 500 కే.. ప్రతి ఇంట్లోకి రానున్న మరో రెండు గ్యారెంటీలు…మహిళ శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క..

Share this