Praja Telangana
తెలంగాణ

సామాజిక దళితోద్ధారకుడు బాబు జగ్జీవన్ రామ్

-బాబు జగ్జీవన్ రామ్ కు భారతరత్న ఇవ్వాలి

-ఘనంగా 118 వ జయంతి దినోత్సవ వేడుకలు

-లెదర్ పార్క్ అధ్యక్షుడు కొలుగూరి విజయకుమార్

నేటి ప్రజా తెలంగాణ, మందమర్రి టౌన్,

సామాజిక దళితొద్దారకుడు, దార్శినికుడు, సంఘ సంస్కర్త మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని మలుపు లెదర్ పార్క్ అధ్యక్షుడు కొలుగూరి విజయ్ కుమార్ అన్నారు. భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతిని పురస్కరించుకోని పట్టణంలోని పాల చెట్టు ఏరియా వద్ద గల మలుపు లెదర్ పార్క్ ఆవరణలో ఆయన వేడుకలను ఘనంగా జరిపారు. ముందుగా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని సంబరాలు జరిపారు. ఈసందర్భంగా కొలుగూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి దశనుండే సామాజిక అంశాలపై పోరాటాలను చేసి ఉప ప్రధానిగా ఎదిగిన బాబు జగ్జీవన్ రామ్ చరిత్ర దళితులకు స్ఫూర్తిని అన్నారు. దాదాపు 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ప్రజా ప్రతినిధిగా విశిష్ట సేవలు అందించిన బాబు జగ్జీవన్ రామ్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. లెదర్ పార్కులో జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామిని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో దళిత ఉద్యమ నాయకులు సంగి సంతోష్, ఉప్పులేటి నరేష్, తుంగపిండి రాజేష్ కుమార్, నోముల దుర్గప్రసాద్, సోమారపు సామెల్, సుద్దాల జనార్ధన్, దరిపెళ్లి కనకయ్య, కొలుగూరి పృథ్వీరాజ్, మహిళా నాయకురాల్లు బత్తుల సరిత, బొడ్డు వినోద, దరిపెల్లి స్వరూపరాణి, దాసరి సమత, కాంపెల్లి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related posts

జబ్బలు సరిసిందెవరు …బొమ్మ గడియారాలు ఇచ్చింది ఎవరు…!కల్లూరు సభలో స్థానిక నేతలపై కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు

ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Share this