*పద్మశాలి భవనం లో మెగా రక్త దాన శిబిరం*
*నేటి ప్రజా తెలంగాణ బెల్లంపల్లి*
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక పద్మశాలి భవన్లో బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల కోసం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని యువత అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ప్రజలతో పాటు సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులందరూ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసిపి రవికుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కోరారు. పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరానికి అధిక సంఖ్యలో హాజరై రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి కాశిపేట ఎస్సై ప్రవీణ్ కుమార్ బెల్లంపల్లి సిఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు