Praja Telangana
తెలంగాణ

*మండపంలో కుంకుమార్చన మహోత్సవం*

-మహిళా భక్తులు ప్రత్యేక పూజలు

నేటి ప్రజా తెలంగాణ:రామకృష్ణాపూర్

రామకృష్ణాపూర్ పట్టణంలోని దుర్గామాత నవరాత్రోత్సవాలు వేడుకలో భాగంగా స్థానిక 13వ వార్డు రామాలయం జై విజయ దుర్గ భవాని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కుంకుమార్చన పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విజయ దుర్గ భవాని మండప సన్నిధిలో కాలనీ మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన పూజలో పాల్గొన్నారు. అర్చకుడు మహాదేవ శర్మ మంత్రాల ఉచ్చరణతో మహిళా భక్తులు భక్తిపార్వశంతో మునిగిపోయారు. అనంతరం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి కి నైవేద్యం సమర్పించి భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు లేళ్ల అశోక్, దొంతమల్ల రమేష్,దొంతమల్ల శ్యాం కుమార్,వనపర్తి ప్రవీణ్, పొన్న సాయికుమార్, కోలా లక్ష్మి, వేల్పుల పోచమ్మ, దొంతమల్ల ఉషారాణి, వనపర్తి ప్రశాంతి, పిల్లి లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

సాగర్ 26 గేట్లు ఎత్తివేత?

ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి’ ప్రతి

షెడ్యూల్డ్ కులముల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు*

Share via