బెల్లంపల్లి పట్టణం 5వ వార్డు ఇంక్లైన్ బస్తి ఏరియాలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు ఆదేశాల మేరకు, నక్క కృష్ణ మరియు జావిద్ బాయ్ ఆధ్వర్యంలో త్వరలో జరగబోవు పార్లమెంట్ ఎలక్షన్స్ ని ఉద్దేశించి ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో బస్తీలోని ముఖ్య కార్యకర్తలు కొంత మంది హాజరైనారు వారందరికీ రాబోయే పార్లమెంటు ఎలక్షన్లో గడ్డం వంశి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని దానికి అందరం కృషి చేయాలని మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు బస్తీ ముఖ్య కార్యకర్తల అందరికీ విన్నవించుకోవడం జరిగింది, అదేవిధంగా ఇంకా కొంతమంది ముఖ్య కార్యకర్తలు హాజరుకానందున మళ్లీ ఒకరోజు మీరంతా బస్తీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని, బస్తీ నుండి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని అందరు కలిసి ఒక ఐదుగురు ప్రతి విధులను ఎన్నుకొని మీరందరూ సంతకాలు చేసి మాకు ఇస్తే, మేము ఎమ్మెల్యే కి అందజేస్తాము దానిద్వారా ఎమ్మెల్యే కి ఈ బస్తీలో సమాచారం కావాలన్నా ఇవ్వాలన్న వారికి సమాచారం ఇవ్వడం జరుగుతుంది, తద్వారా మీ బస్తీ వాసులందరికీ వారు సమాచారం తెలియజేస్తారు, మరియు ముఖ్య కార్యకర్తలు అందరూ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న ఆరు గ్యారెంటీలను ప్రతి గడపగడపకు తీసుకెల్లాలని, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ రకమైన అభివృద్ధి జరుగుతుందో ఏ రకమైన పథకాలు పేదలకు అందుబాటులోకి వస్తాయో ఓటర్ల అందరికీ వివరించి, పార్లమెంటు ఎలక్షన్లో తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశి చేతి గుర్తుకు ఓటు వేయాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త ఓటర్లకు తెలియజేయాలని, గతంలో అసెంబ్లీ ఎలక్షన్ లో కంటే మన బస్తీలో ఇంకా ఎక్కువ మెజార్టీ రావాలని దానికి మీరంతా కష్టపడి పనిచేయాలని, కష్టపడి పని చేసిన వారిని తప్పకుండా పార్టీ మరియు మన ఎమ్మెల్యే గుర్తుపెట్టుకుంటారని, అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా వారికి న్యాయం చేసే విధంగా మేమంతా మాట్లాడతామని బస్తి వాసులందరికీ తెలియజేయడం జరిగింది, అదేవిధంగా ఈ వార్డు నుంచి పదవ తరగతి ఫలితాల్లో స్కూల్ టాపర్ గా నిలిచిన, నిధి మిశ్రా అనే బాలిక ప్రభుత్వ బాలికల పాఠశాలలో స్కూల్ టాపర్ గా నిలిచినందుకు గాను మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు, మరియు బస్తీ వాసులు బాలికకు సన్మానం చేసి అభినందనలు తెలియజేడo జరిగింది, ఈ కార్యక్రమంలో TPCC రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి, అన్వర్ ఖాన్, అమానుల్లా ఖాన్, సుజ్జు, జావిద్, రాజరత్నం, గౌస్ బాయ్, కన్నూరి రాజలింగు,
బస్తీ పెద్దలు శ్రీనివాస్, నక్క రాకేష్, తదితరులు పాల్గొన్నారు.