*రాజ్యాంగ రక్షణ మనందరి బాధ్యత*
*మాల మహానాడు అధ్యక్షులు గరిసె రవీందర్.
*లక్షెట్టిపేట: రాజ్యాంగ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, రాజ్యాంగ రక్షణకై ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని మాల మహానాడు మండల అధ్యక్ష కార్యదర్శులు గరిసె రవీందర్, బైరం లింగన్న లు పేర్కొన్నారు. సోమవారం రాజ్యాంగ రక్షణ ముగింపు సభకు తరలి వెళ్తున్న లక్సెట్టిపేట, జైపూర్ మాల మహానాడు మండలాల నాయకులు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బీజేపీ గెలిస్తే భారత రాజ్యాంగాన్ని మార్చి రాజరిక వ్యవస్థ తీసుకొస్తారన్నారు. రానున్న రోజుల్లో ఓటు అనే ఆయుధంతో బీజేపీని ఓడించి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఐక్యంగా ఉండి రాజ్యాంగ రక్షణకై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ సైనిక్ దళ్ నియోజకవర్గ అధ్యక్షుడు శీలం వెంకటేష్ ,జై భీమ్ సైనిక్ దళ్ మండల అధ్యక్షుడు అలుగునూర్ నరేష్, జిల్లా కార్యదర్శి మల్లేష్, జైపూర్ మండల అధ్యక్షుడు పరమేష్ లు వెళ్తున్నారు.