మంచిర్యాల జిల్లాలో 13,25 వార్డులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు
మంచిర్యాల:ప్రజా తెలంగాణ న్యూస్
మంచిర్యాల జిల్లా కేంద్రం మున్సిపాలిటీ పరిధిలోని 13,25 వ వార్డుల్లో సిసి రోడ్లు,డ్రైనేజీ పనులను మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పరిరక్షించడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే 13,25 వార్డులలో సిసి రోడ్లు డ్రైనేజీ పనులను రాబోయే వర్ష కాలం దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలవకుండా చూడాలని అధికారులను ఆదేశించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య,వైస్ చైర్మన్ సల్ల మహేష్,కౌన్సిలర్ల, నాయకులు,నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.