తుంగతుర్తి మండలంలో అంబరాన్నoటిన హోలీ సంబరాలు
తుంగతుర్తి సూర్యాపేట జిల్లా మార్చి 25
తుంగతుర్తి మండల కేంద్రంలో సోమవారం హోలీ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. తుంగతుర్తి మెయిన్ రోడ్ పై, గల్లీలలో, గ్రామాలలో యువకులు, పిల్లలు ఒకరినొకరు రంగులు పూసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అదేవిధంగా మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఘనంగా హోలీ పండుగ జరుపుకున్నారు. వీరితోపాటు తుంగతుర్తి విలేఖరి సోదరులు కూడా ఆనంద ఉత్సవాలతో హోలీ పండగ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డి జె ఎఫ్ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, డి జె ఎఫ్ సభ్యులు పాల్గొన్నారు