Praja Telangana
తెలంగాణ

ఆదివాసులకు రక్షణ కల్పించలేక పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.

ఆదివాసులకు రక్షణ కల్పించలేక పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.

విమర్శించిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు

నేటి ప్రజా తెలంగాణ – కాగజ్ నగర్

కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటుచేసిన పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రసంగించిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉదయం నుంచి మమ్మల్ని హౌస్ అరెస్టు చేశారని, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేయడం దారుణమని అన్నారు. సాక్షాత్తు గిరిజన నాయకురాలు ఇన్చార్జి మంత్రిగా ఉన్న జిల్లాలోనే ఆదివాసుల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆదివాసి మహిళను పరామర్శించనున్నారని తెలిపారు.
వెంటనే సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు కఠిన శిక్షపడేలా చూడాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళకు రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ధోని శ్రీశైలం, అసెంబ్లీ కన్వీనర్ గొల్లపల్లి వీరభద్ర చారి, పట్టణ అధ్యక్షులు సిందం శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ దెబ్బటి శ్రీనివాస్, మాజీ ఎంపిపి కొప్పుల శంకర్, మాజీ ఎంపీటీసీ దుర్గం మోతిరాం పాల్గొన్నారు.

Related posts

అలీ భాయ్ పుట్టినరోజు సందర్భంగా అల్పాహారం పంపిణీ. ‌

ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడి సింగరేణి ఉద్యోగి చికిత్స పొందుతూ మృతి*

Beuro Inchange Telangana: Saleem

బెల్లంపల్లిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు.

Share via