నా గురువర్యులు కే.ఆర్ కు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
జర్నలిజం చేసిన జర్నలిజంలో ఓనమాలు నేర్పింది మాత్రం కే.ఆర్ కలం.
అసలైన జర్నలిజంతో ప్రజల గుండెల్లో ఉండిపోతామని పాఠాలు నేర్పిన నా గురువు.
ఎంతో మంది జర్నలిజం వైపు అడుగులు వేయడానికి సహాయపడుతున్న కే.ఆర్ కలం.
నేటి ప్రజా తెలంగాణ – రామకృష్ణాపూర్
దాదాపు 35 సంవత్సరముల నుండి ఎక్కడ రాజీ పడకుండా, ప్రలోభాలకి గురికాకుండా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలిన, తనకున్న ఆలోచనలతో నికార్సైన జర్నలిజాన్ని కొనసాగిస్తూ తన బాటలో ఓ 100 మంది నికార్సైన జర్నలిజం చేసే తన శిష్యులని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేసేలా వారిని మలిచి రాష్ట్రానికి అందించాలన్న తన దృఢ సంకల్పం ముందు ఎన్ని ఆటుపోతులైన గడ్డి పరకతొ సమానంగా తీసేసి కఠోరమైన శ్రమతో ముందుకు సాగుతున్న కె.ఆర్ కలం కృష్ణారెడ్డి కి మనస్ఫూర్తిగా ఉపాధ్యాయుల దినోత్సవం తెలియజేస్తూ, మీ శిష్యుడు జర్నలిస్ట్ ఎం ఎస్ కె మాదాసు శ్రీకాంత్ యాదవ్. నేను జర్నలిజం చేసినప్పటికీ నా ఓనమాలు జర్నలిజంలో నేర్చుకుంది మాత్రం కేఆర్ కలం లోనే. జర్నలిజం నేర్చుకోవడానికి చాలా ఇన్స్టిట్యూషన్స్ వేలల్లో వసూలు చేస్తూ విలువలు లేని జర్నలిజాన్ని నేర్పిస్తున్న ఈ కాలంలో, సంపాదన మీద ఎలాంటి ఆలోచన లేకుండా ఉచితంగా విలువలతో కూడిన జర్నలిజాన్ని జర్నలిస్టులకు పరిచయం చేస్తూ నాలాంటి జర్నలిస్టులని సమాజానికి అందిస్తున్న నా గురువు కె.ఆర్ కి నా పాదాభివందనం తెలియజేస్తున్నాను. అంతటితోనే తన కర్తవ్యం నిర్వర్తించాను అని అనుకోకుండా ఇలాంటి విలువలతో కూడిన జర్నలిస్టులని కాపాడుకోవడానికి స్వయంగా తానే రంగంలోకి దిగి డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనే సంఘాన్ని స్థాపించి ప్రతి జర్నలిస్టులకి ఎక్కడ ఆపద వస్తే అక్కడ నేనున్నాను అంటూ వెళ్లి వారిని పలకరించి పరామర్శించి ధైర్యం చెప్పి ఏకైక జర్నలిస్ట్ నేను చూసిన వాళ్లలో నా గురువు కె.ఆర్ మాత్రమే. వార్తా సేకరణలో ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల బాధలను ప్రభుత్వానికి చేరవేసే సమయంలో తనకి ఏదైనా జరిగితే ఎలా అని ఆలోచించి జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఒక పాలసీని రూపొందించిన మహానుభావుడు కే.ఆర్. అక్రిడేషన్ ఉన్నవాళ్లే జర్నలిస్టులు కాదు అని, అక్రిడేషన్ అనేది అంగట్లో దొరుకుతున్న ఒక వస్తువుని, అక్రిడేషన్ తో సంబంధం లేకుండా దిగువ మధ్య తరగతిలో ఉన్న ప్రతి జర్నలిస్టుకి ఉండడానికి ఇల్లు వారి పిల్లలు చదువుకోవడానికి ఫీజుల్లో 50% రాయితీలు ఇవ్వాలని గత నాలుగు సంవత్సరాలుగా కేవలం విలువలు ఉన్న జర్నలిస్టులు కనుమరుగైపొకుడదు అనే ఒకే ఒక్క కారణంతో గత రెండు ప్రభుత్వాలతో నిరంతరంగా చర్చలు జరుపుతున్న ఏకైక వ్యక్తి నా గురువు అని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇలాంటి గురువు ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరోసారి నా గురువు కె.ఆర్ కి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ శిష్యుడు జర్నలిస్ట్ ఎం.ఎస్.కె.