*కిక్కిరిసిన జనసముద్రంలో కేసీఆర్ రోడ్ షో*
*మంచిర్యాల జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ రోడ్ షో*
నేటి ప్రజా తెలంగాణ: మంచిర్యాల
మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబి చౌరస్తాలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో,బహిరంగ సభ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు నెలల కింద ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి అని వాపోయారు.కేసీఆర్ ఉన్నప్పుడు పోనీ కరెంటు ఇప్పుడు ఎందుకు పోతుంది అని,ప్రతీ ఇంటికి పరిశుభ్రమైన నీరు,కళ్యాణ లక్ష్మి చెక్కులు, సీఎం రిలీఫ్ ఫండ్ ఎటు పోయాయని ప్రశ్నించారు.అలాగే రైతులకు డిసెంబర్ 9 నాడే రుణ మాఫీ అని అన్నాడు,రైతు బంధు వేస్తానని వేయలేదు,కళ్యాణ లక్ష్మి పేరా ఇస్తానన్న తులం బంగారం ఎటు పోయింది అని అన్నారు.కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారంటీలలో ఏ ఒక్కటి అమలు కాలేదు అని తెలిపారు.ఆ పథకాలలో కేవలం ఒక్కటే ఫ్రీ బస్ అమలు అయింది,అందులో ఆడవాళ్ళు శికలు పట్టుకొని కొట్టుకుంటున్నారు అని తెలియజేశారు.
అంతేకాకుండా ఉచిత బస్సు ద్వారా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని వాపోయారు.ఆటో డ్రైవర్ల పక్షాన అసెంబ్లీలో కచ్చితంగా ప్రస్తావిస్తాం అని తెలియజేశారు.రేవంత్ రెడ్డి ఏ ఊరికి పోతే ఆ దేవుడి మీద ఓట్లు వేస్తున్నాడు,
పల్లెలు ఆగమైతున్నాయి అని అన్నారు.గ్రామ పంచాయతీలకు పైసలు ఇస్తలేరు అని తెలిపారు. అదేవిధంగా
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన చెన్నూర్ ఎత్తిపోతల పథకం ఆపేసారు,ఇక్కడ ఉన్న మార్కెట్ పనుల ను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసింది,
తెలంగాణాలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి, రైతులకు 500 బొనస్ బోగస్ మాట అయింది అని తెలిపారు.
పాత ఆదిలాబాద్ జిల్లాలో మారు ముల ప్రాంతాల కోసం మూడు జిల్లాలు చేసుకున్నాం,వీటిని రేవంత్ రెడ్డి రద్దు చేస్తానని అంటున్నాడు అని తెలిపారు.మంచిర్యాల జిల్లాగా ఉండాలంటే కొప్పుల ఈశ్వర్ కు ఓటు వేయాలి,
బ్యాలెట్ యుద్ధం లో కొప్పుల ఈశ్వర్ ను గెలిపించాలి అని ప్రజలకు సూచించారు. అంతేకాకుండా విదేశాలకు వెళ్లే విద్యార్థులకు స్కాలర్షిప్ లి బంద్ చేశారు ప్రజలు గమనించాలి అని తెలిపారు.
కొప్పుల ఈశ్వర్ సింగరేణి బిడ్డ ఈశ్వర్ గెలిస్తే సింగరేణి నీ కాపాడతారు అని తెలిపారు.సింగరేణి నీ రేవంత్ రెడ్డి ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నాడు,
రైతుల నోట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మన్నుకొట్టింది,
గోదావరి జలాలు ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్తుంటే ముఖ్య మంత్రి ఎందుకు మాట్లాడడం లేదు అని ప్రశ్నించారు.పార్లమెంట్ లో బిఆర్ఎస్ ఎంపీలు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జైళ్లకు కేసీఆర్ భయపడడు,చావు నోట్లో తల పెట్టీ తెలంగాణా సాధించుకున్నాం అని గతం గుర్తు చేశారు.అదేవిధంగా
1లక్ష 30 వేల మందికి దళిత బంధు ఇచ్చాము.అందరి పైసలు వసూలు చేస్తున్నారు.
రైతు భీమాకు ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వడం లేదు.ముస్లిం మైనారిటీ సోదరులకు రంజాన్ తోఫా లు ఇవ్వలేదు అని తెలిపారు.నరేంద్ర మోడీ అందరికీ 15 లక్షలు ఇస్తా అని మోసం చేశాడు అని తెలిపారు.అందువలన ప్రజలందరూ కచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ,మంచిర్యాల జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్,మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు,బెల్లంపల్లి మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య,మహిళా నాయకులు,యువ నాయకులు,కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.