ఎంపీ అభ్యర్థికి స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణను ఏఐసీసీ ప్రకటించిన తర్వాత చెన్నూరు నియోజకవర్గానికి వచ్చేసిన ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణకు ఇందారం వద్ద క్యాతనపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఆయనకు అధిష్ఠానం టికెట్ కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వంశీని భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.