జనహిత సేవా సమితి చలివేంద్రం ప్రారంభం.
ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన 1 టౌన్ సి ఐ దేవయ్య
జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో బెల్లంపల్లి పట్టణం కాంట చౌరస్తా వద్ద చలివేంద్రం చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్లంపల్లి వన్ టౌన్ సిఐ . దేవయ్య గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రాంభించారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ దేవయ్య మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తి ని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం అని జనహిత సేవా సమితి సభ్యులని అభినందించారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ జనహిత సేవా సమితి చలివేంద్రం ఏర్పాటు తో ప్రారంభించబడి ఎనిమిదవ సంవత్సరం చలివేంద్రం ప్రారంభించడం జరిగిందని ఎండల నుండి ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్న దాతలు మరియు జనహిత సబ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గెల్లీ రాజలింగు జనహిత సభ్యులు పాల్గొన్నారు.