రెండు వార్డులకు మధ్య దారి వెడల్పు చేయించిన కౌన్సిలర్ పోలు ఉమాదేవి శ్రీనివాస్
బెల్లంపల్లి 33 వ వార్డు హనుమాన్ బస్తి బాబు క్యాంపు వైపు కలిపే రోడ్డు ఇరుకుగా ఉందని రాకపోకలకు ఇబ్బందిగా ఉందని అక్కడి ప్రజలు కౌన్సిలర్ పోలు ఉమాదేవి, శ్రీనివాస కి తెలియజేయడంతో కౌన్సిలర్ సంబంధిత మున్సిపల్ అధికారులతో మాట్లాడి వారి సహా సహకారాలతో రోడ్డు వెడల్పు చేయించామని వారు తెలిపారు. భవిష్యత్తులో ఎక్కడైనా వాహనాలు వచ్చే దారిలో ఇరుకుగా ఉంటే ప్రజలు స్వచ్ఛందంగా వాటికి తొలగించి రాకపోకలకు దారి ఇవ్వాలని కౌన్సిలర్ ఉమాదేవి తెలిపారు. రాకపోకలు సజావుగా ఉంటే, అంబులెన్స్ డాక్టర్లు రావడానికి ప్రజలకు అవసరాలకు తిరిగే వాహనాలు అన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు చూసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పోలు ఉమాదేవి, కాంగ్రెస్ నాయకుడు పోలు శ్రీనివాస్ మున్సిపల్ అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.