*బెల్లంపల్లి హెడ్ క్వార్టర్ లో ‘మాబ్ ఆపరేషన్’ మాక్ డ్రిల్ ప్రాక్టిస్*
*శాంతిభద్రతలను పరిరక్షించటమే మాబ్ ఆపరేషన్ డ్రిల్ ముఖ్య లక్ష్యం.*
అక్రమంగా గుమ్మిగుడిన జన సమూహాలను కంట్రోల్ చేయుటకు, అవాంఛనీయ సంఘటనలు పోలీసుల దృష్టికి వచ్చినప్పుడు, (144) 163 బి ఎన్ ఎస్ ఎస్. సెక్షన్ అమల్లో ఉన్న సందర్భంలో ప్రజల శాంతి భద్రతల నేపథ్యంలో పోలీసులు ఏ విధంగా స్పందించాలి, అక్రమ జన సమూహాలను ఏ విధంగా చెదరగొట్టాలి అనే వ్యూహంలో భాగంగా రామగుండము పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్. ఐజి ఆదేశాల మేరకు రామగుండము పోలీస్ కమీషనరేట్ పరేడ్ గ్రౌండ్ లో బెల్లంపల్లి ఆర్ఐ అడ్మిన్ వామన మూర్తి ఆధ్వర్యంలో బెల్లంపల్లి, మంచిర్యాల, జైపూర్ సబ్ డివిజన్ సివిల్, ఎఆర్ పోలీసులకు మాబ్ ఆపరేషన్-మాక్ డ్రిల్ ప్రాక్టీస్ నిర్వహించారు.
ప్రజల, ప్రభుత్వ ఆస్తులు ద్వంసం చేస్తూ విధ్వంసానికి పాల్పడుతున్న సందర్భాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ, జన సమూహాలను నియంత్రించిశాంతిభద్రతలను ఎలా నియంత్రించాలన్న వాటిపై మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ ప్రాక్టీస్ ముఖ్య ఉద్దేశాన్ని సిబ్బందికి సీఐ లు, ఆర్ఐ వివరించారు.మాబ్ ఆపరేషన్ డ్రిల్ లో ఓ వైపు ప్లకార్డులు చేతపట్టిన ఆందోళనకారులు, అల్లరి మూకలు మరోవైపు వారిని ఎదుర్కొనేందుకు సిద్ధమైన పోలీసులు జన సమూహాలను కంట్రోల్ చేసేందుకు మొదటగా హెచ్చరికలు వినకపోతే మెజిస్ట్రేట్ అనుమతి, ఉన్నతాధికారుల అనుమతితో భాష్పవాయువు ప్రయోగించడం, ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ కెనాన్ వారిపై ప్రయోగించడం, ఉద్రిక్త పరిస్థితుల్లో తనను తాను రక్షించుకుంటూ లాఠీ ఛార్జీ చేపట్టడం, ప్లాస్టిక్ పెల్లెట్స్ ఫైరింగ్ చేయడం అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే ఫైరింగ్ చేయడం వంటివి ఆర్ఐ, సీఐలు అర్ముడ్ సిబ్బంది డెమో ప్రదర్సన చేపించి తరువాత బెల్లంపల్లి , మంచిర్యాల, జైపూర్ సబ్ డివిజన్ సివిల్ సిబ్బందితో ప్రాక్టిస్ చేపించడం జరిగింది. మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశం శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు, ఘర్షణలు తలెత్తినప్పుడు శాంతిభద్రతలను పరిరక్షించడానికి పోలీస్ శాఖ ఎలా వ్యవహరిస్తుంది? ఘర్షణలకు పాల్పడిన వారిపై ఏవిధంగా చర్యలు తీసుకుంటారు? అనే దాని గురించి అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ నిర్వహించినట్లు చెప్పారు.ఈ కార్యక్రమం లో మంచిర్యాల టౌన్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు, చెన్నూర్ టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్,ఆర్ఐ లు వామన మూర్తి మంచిర్యాల, బెల్లంపల్లి, జైపూర్ సబ్ డివిజన్ ఎస్ఐ లు, ఆర్ఎస్ఐ లు ప్రవీణ్, సరిత, ఏ ఆర్, సివిల్ సిబ్బంది 200 మంది తదితరులు పాల్గొన్నారు.