*సమస్యలకు నిలయం బెల్లంపల్లి మున్సిపాలిటి*
*ఎంసిపిఐ(యు)పార్టీ జిల్లాకార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్*
బెల్లంపల్లి మున్సిపాలిటీ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ మేనేజర్ కి ఎంసిపిఐ(యు)పార్టీ జిల్లాకార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని,గత పది,పదిహేను రోజులుగా మంచినీళ్లు రాకపోవడంతో ప్రజలు తీవ్రమైన నీటి ఎత్తడిని ఎదుర్కొంటున్నారని,కనీసం నీటి ట్యామ్కర్ల ద్వారా నీటిని పంపించడం లేదని,చెత్త బండ్లు కూడా రాక ఎక్కడి చెత్త అక్కడే పేరుకు పోతుందని,పాలిటెక్నిక్ కళాశాల రోడ్డుకు ఇరువైపుల వ్యాపారులు చెత్త వేస్తున్నారని,కాలేజ్ దగ్గరి ట్రాన్స్ఫార్మర్ వద్ద చెత్త పేరుకు పోయిందని దీని వల్ల అటు విద్యార్థులకు,బస్తి ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని,అదేవిధంగా అనేక వార్డుల్లో డ్రైనేజీలు లేకపోవడంతో నీరు రోడ్డు మీదే ప్రవహిస్తుందని పారిశ్యుద్ద కార్మికులతో శుభ్రపరచడం లేదని దీనివల్ల దోమలు,ఈగలు విపరీతమై ప్రజలు రోగాల బారిన పడుతున్నారని,కేవలం కొబ్బరికాయలు కొట్టడానికే అధికారులు, ప్రజా ప్రతినిధులు పరిమితమయ్యారని,సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని,ప్రజలకు హాని కలిగించే కోనోకార్పస్ చెట్లను తొలగించాలని విన్నవించిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని,వెంటనే అన్ని వార్డుల్లో నీటి,రోడ్డు,డ్రైనేజి,పారిశ్యుద్ద,విద్యుత్తు సమస్యలతో పాటు ఇతర ప్రజా సమస్యలను పరిష్కరించాలని లేనియెడల ఎంసిపిఐ(యు)పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల,పట్టణ కార్యదర్శులు ఆరెపల్లి రమేష్,సతీష్ తదితరులు పాల్గొన్నారు.